: అసిస్టెంట్‌తో బాలయ్య అనుచిత ప్రవర్తనపై అభిమాని బహిరంగ లేఖ!
సినిమాల్లో పని ఎక్కువ అవడం వలనో లేక రాజకీయ ఒత్తిళ్ల వలనో బాలకృష్ణ అప్పుడప్పుడూ సహనం కోల్పోతుంటారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో అసిస్టెంట్‌ను తల మీద కొట్టి ఆయన షూ లేసు కట్టించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఆగ్రహానికి గురైన ఓ అభిమాని బాలకృష్ణకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది.
`అన్నా... రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా!` అనే టైటిల్‌తో ఉన్న ఈ లేఖలో వివిధ సందర్భాల్లో ఆయన అనుచిత ప్రవర్తనను విమర్శిస్తూ, ప్రేక్షకుల విలువను కళ్లకు కట్టినట్లు వివరించాడు. దొరలు, రాజుల కాలం పోయిందని, ప్రేక్షకుడి టికెట్ డబ్బుల మీద బతికే మీరు దొరల్లా ఫీల్ అవకండని లేఖలో ఉంది. ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని ఊరికే అనలేదని, మీ సినిమాని ప్రేక్షకులు బహిష్కరిస్తే వీఐపీలో ఒక్క అక్షరం మిస్సయ్యే పరిస్థితి మీకు వస్తుందని అభిమాని లేఖలో విమర్శించాడు.