: జగన్ పై దేవినేని అవినాష్ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై చర్యలు తీసుకోవాలని విజయవాడలో పోలీసులకు టీడీపీ నేత దేవినేని అవినాష్ ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ కు నైతిక విలువలు లేవని అన్నారు. చంపండి, నరకండి అన్న జగన్ పై రాజద్రోహం కేసు పెట్టాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రిని కాల్చాలని చెబుతూ పార్టీ నేతలకు ఏం నేర్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో జగనే ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలతో తాను చాలా పెద్ద ఫ్యాక్షనిస్టునని రాష్ట్ర ప్రజలకు జగనే స్వయంగా చెబుతున్నారని ఆయన తెలిపారు.