: 40 టెస్టుల తర్వాత తొలి వికెట్ తీసిన శ్రీలంక క్రికెటర్!
శ్రీలంక క్రికెటర్ కరుణరత్నే అరుదైన రికార్డును సాధించాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకు 40 టెస్టులు ఆడిన ఆయన... భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి వికెట్ తీశాడు. బ్యాట్స్ మెన్ అయిన కరుణరత్నే అప్పుడుప్పుడు పార్ట్ టైమ్ బౌలర్ అవతారం ఎత్తుతుంటాడు. ఈ ఉదయం కరుణరత్నే బౌలింగ్ లో పుజారా (133) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. దీంతో, కరుణరత్నేకు తొలి వికెట్ లభించింది.