: పుజారా అవుట్... టీమిండియా 377/4
కొలంబో టెస్టులో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఛటేశ్వర్ పుజారా అవుటైపోయాడు. రెండో టెస్టు 56 పరుగుల వద్ద ధావన్ అవుటైపోవడంతో బ్యాటింగ్ కు క్రీజులోకి వచ్చిన పుజారా, నిన్నంతా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి రోజు ఆటముగించిన పుజారా, నేడు కేవలం ఐదు పరుగులు జోడించి 133 పరుగల వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
103 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన రహనేకు జతగా రవిచంద్రన్ అశ్విన్ జత కలిశాడు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా 103 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. రహానే (119), అశ్విన్ (18) ఆడుతున్నారు.