: పదవి కోసం శిల్పా చక్రపాణికి రూ. 12 లక్షలు ఇచ్చా: టీడీపీ నేత


మహానంది ఎంపీపీ పదవి బీసీలకు దక్కడంతో, దాన్ని ఓర్చుకోలేకపోయిన అప్పటి ఎమ్మెల్సీ, నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ శిల్పా చక్రపాణిరెడ్డి రూ. 12 లక్షలు డిమాండ్ చేయగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో పదవి కోసం ఆ డబ్బును తాను ఇచ్చానని మహానంది ఎంపీపీ భర్త వెల్లడించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయ జీవితాన్ని, ఎన్నో పదవులను కట్టబెట్టిన టీడీపీని శిల్పా దూషించడం సరికాదని అన్నారు. పలు పదవులను ఆయన అమ్ముకున్నాడని, ప్రజలు శిల్పా కుటుంబంపై తమ ఆగ్రహాన్ని చూపే రోజులు వచ్చాయని విమర్శించారు. కేఈ మాట్లాడుతూ, డబ్బు కోసం పదవులను అమ్ముకున్న శిల్పా, రాజకీయాలకు మచ్చ తెచ్చాడని ఆరోపించారు.

  • Loading...

More Telugu News