: మహిళల కోసం 181 నెంబర్... ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు!


ఎన్నిచట్టాలు, ఎంత చైతన్యం కలిగించినా సమాజంలో మహిళలు సమస్యలెదుర్కొంటూనే ఉన్నారు. పుట్టిళ్లలో వివక్ష, మెట్టినిళ్లలో వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో మహిళలకు అండగా ఉండేందుకు వుమెన్ హెల్ప్‌ లైన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఒకే ఒక్క ఫోన్‌ కాల్ తో సమస్యలకు పరిష్కారాలు అందించేందుకు 181 నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 15 నుంచి ఈ 181 కాల్ సెంటర్ అందుబాటులోకి రానుంది.

పోకిరీలు, అత్తమామలు, బంధువులు, ఇతర నేరస్థుల బారి నుంచి మహిళలను కాపాడేందుకు ఈ హెల్ప్‌ లైన్ సాయం చేస్తుంది. గతంలో 108ను నిర్వహించిన జీవీకే సంస్థ భాగస్వామ్యంతో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. బాధిత మహిళలు ఎదుర్కొనే సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వ శాఖలు, పోలీసులు, న్యాయశాఖ, వైద్యారోగ్యం, మహిళా శిశుసంక్షేమ శాఖలు జోక్యం చేసుకుని పరిష్కారం చేస్తాయి.

దీనిని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. కాగా, ఇప్పటికే బాలల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా చైల్డ్‌ లైన్ 1098 హెల్ప్‌ లైన్‌ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా పలువురు బాలలను రక్షించారు. అది విజయవంతం కావడంతో దీనిని అమలులోకి తీసుకురానున్నారు. 

  • Loading...

More Telugu News