: గొప్పమనసు చాటుకున్న సన్నీలియోన్ దంపతులు!


ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ దంపతులు మహారాష్ట్రలోని లాతూర్ కి చెందిన అనాథాశ్రమం నుంచి నిషా అనే బాలికను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ బాలికను సన్నీలియోన్ దంపతులు దత్తత తీసుకునేందుకు ముందు 11 కుటుంబాలు ఆ బాలికను చూశాయట. అయితే వారెవరూ ఆ బాలికను దత్తత తీసుకునేందుకు ముందుకు రాలేదని కారా అనే అడాప్షన్ ఏజెన్సీ తెలిపింది.

చిన్న పిల్లలను దత్తత తీసుకునే సమయంలో చిన్నారి తెల్లగా ఉందా? లేదా? ఆరోగ్యంగా ఉందా? లేదా? అని వివరాలు అడుగుతారని కారా ఎజెన్సీ సీఈవో దీపక్ కుమార్ చెప్పారు. కానీ సన్నీ దంపతులు మాత్రం చర్మ రంగు, బ్యాక్ గ్రౌండ్, ఆరోగ్యం వంటి వివరాలేవీ అడగలేదని, వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని, మూడు వారాలకు వచ్చి పాపను దత్తత తీసుకున్నారని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News