: మోదీ లేఖకు ప్రణబ్ కుమార్తె స్పందన!


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు తండ్రిలాంటివారని, ఇన్నాళ్ల ప్రయాణంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని ఆ బహిరంగ లేఖలో రాశారు. ఆ లేఖను ట్విట్టర్ ద్వారా ప్రణబ్ ముఖర్జీ పంచుకున్నారు. మోదీ లేఖ తన మనసును హత్తుకుందని ఆయన తెలిపారు. అనంతరం ఈ లేఖపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ స్పందిస్తూ, ‘థ్యాంక్యూ మోదీ సర్‌. కానీ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) కార్యకర్తగా.. మీ ప్రభుత్వం తీసుకునే విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం విమర్శిస్తాను. ఈ విధానమే ప్రజాస్వామ్యానికి అందం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నవ్వుతున్న ఎమోజీలను కూడా జతచేశారు. 

  • Loading...

More Telugu News