: జగన్ ది రాక్షస మనస్తత్వం..శిల్పా సోదరులది పిశాచి మనస్తత్వం: టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజం
టీడీపీని వీడిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ, చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శిల్పాపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎంపీ,ఎమ్మెల్యే సీట్ల కోసమే ఆయన పార్టీ మారుతున్నారంటూ మండిపడ్డారు. తాను కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని అన్నారు. ‘వైసీపీ అధినేత జగన్ ది రాక్షసమనస్తత్వం .. శిల్పా సోదరులది పిశాచి మనస్తత్వం’ అంటూ రాజశేఖరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.