: హ్యాకింగ్‌కు గురైన పాకిస్థాన్ అధికారిక వెబ్సైట్.... భారత జాతీయ గీతాన్ని ప్లే చేసిన హ్యాకర్లు!
పాకిస్థాన్ అధికారిక వెబ్సైట్లో కొంత సేపు భారత జాతీయ గీతం ప్లే అయింది. అలాగే తెర మీద `భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు` అంటూ మెసేజ్ కూడా చూపించింది. 2:45 నిమిషాలకు పాక్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారు. తమను తాము నియో హ్యాకర్‌గా వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన వారు పేర్కొన్నారు. తర్వాత కొద్దిసేపటికి వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ సైబర్ విభాగం పునరుద్ధరించింది. పాకిస్థాన్ వారి వెబ్సైట్లకు సరైన రక్షణ ఉండదని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. గతంలో కూడా కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ వైఖరిని ఖండిస్తూ ఆ దేశ ప్రభుత్వానికి చెందిన 30కి పైగా వెబ్సైట్లను హ్యాకర్లు హ్యాక్ చేశారు.