: రాజ్యసభకు ఎట్టకేలకు హాజరైన సచిన్ టెండూల్కర్!
రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు ఈ రోజు రాజ్యసభకు హాజరయ్యారు. రాజ్యసభకు సచిన్ హాజరుకావడం లేదంటూ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ విమర్శించిన మర్నాడే టెండూల్కర్ హాజరుకావడం గమనార్హం. కాగా, రాజ్యసభ సభ్యుల్లో బాలీవుడ్ సీనియర్ నటి రేఖ, క్రికెట్ దిగ్గజం సచిన్ మాత్రమే అత్యల్ప హాజరు శాతం కలిగిన సభ్యులు. ఈ విషయాన్ని ఎంపీ నరేష్ అగర్వాల్ గతంలో కూడా ప్రస్తావించారు. రాజ్యసభ సమావేశాలకు, చర్చలకు హాజరుకాని పక్షంలో వీళ్లిద్దరూ తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన గతంలో ఉచిత సలహాలు ఇవ్వడమే కాదు, డిమాండ్ కూడా చేశారు. ఇదిలా ఉండగా, యూపీఏ హయాంలో 2012లో సచిన్ ను రాజ్యసభకు నామినేట్ చేశారు.