: లేడీ క్రికెట్ స్టార్ మిథాలీని విస్మరించిన బీసీసీఐ... హర్మన్ ప్రీత్ ను మాత్రం మరువలేదు!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను బీసీసీఐ విస్మరించింది. జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ, ఇటీవలి వరల్డ్ కప్ లో జట్టును ఫైనల్స్ కు చేర్చిన ఆమెను రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేస్తారని నిన్నటి వరకూ వార్తలు రాగా, ఆమె పేరును బీసీసీఐ సిఫార్సు చేయలేదు. ఇదే సమయంలో ఓ మ్యాచ్ లో అద్భుత రీతిలో 171 పరుగులు బాదిన హర్మన్ ప్రీత్ కౌర్ ను అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది.
భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, బాక్సర్ మనోజ్ కుమార్, పారా ఒలింపిక్ పతక విజేతలు దీపా మాలిక్, దేవేంద్ర జజారియా, మారియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భాటీలను ఖేల్ రత్న అవార్డులకు పోటీ పడనున్న వారిలో ఉన్నారు. వరల్డ్ కప్ పోటీల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించిన మిథాలీ పేరు అవార్డుల జాబితాలో లేకపోవడంతో బీసీసీఐ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.