: త్వరలో మార్కెట్లోకి రానున్న పతంజలి దుస్తులు!
ఇప్పటికే ఆహార పదార్థాలు, మందులు, ఇతర సామాగ్రి తయారీ మార్కెట్‌లో ప్రవేశించిన బాబా రామ్‌దేవ్ పతంజలి బ్రాండ్, త్వరలో తమ బ్రాండ్ దుస్తులను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో దేశీయ మెన్స్ వేర్, విమెన్స్ వేర్, కిడ్స్ వేర్ దుస్తులను పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని కొనుగోలు కోసం బిగ్‌బజార్‌తో పాటు దాదాపు 250 స్టోర్లలో అందుబాటులో ఉంచనున్నట్లు పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా తెలిపారు. దుస్తుల తయారీ రంగంలో పతంజలి అడుగుపెడుతుందని, ప్రత్యేకంగా దేశీయ కుర్తా - పైజామాలతో పాటు విదేశీ జీన్స్, టీషర్ట్‌లను కూడా తయారుచేస్తామని గతేడాది ఇండోర్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశంలో రామ్‌దేవ్ బాబా వెల్లడించిన సంగతి తెలిసిందే!