: నా భర్తకు మరో యువతితో సంబంధం నిజమే... తనే సూర్యకుమారి అని తెలియదు: విద్యాసాగర్ భార్య


రెండు రోజుల క్రితం అర్థరాత్రి పూట ప్రభుత్వ డాక్టర్ సూర్యకుమారి తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కోడలు, విద్యాసాగర్ భార్య వెల్లడించారు. ఆ అమ్మాయి వచ్చిన మాట నిజమేనని, ఆపై ఓ పావుగంట తరువాత వెళ్లిపోయిందని, ఆ అమ్మాయిని ఇంట్లో దించి వస్తానని తన భర్త కూడా వెళ్లాడని స్పష్టం చేసింది. ఇప్పుడు తన భర్తను అరెస్ట్ చేశారని, ఆయన్ను ఎందుకు తీసుకెళ్లారో, ఎక్కడ పెట్టారో తెలియడం లేదని, తన భర్త పరిస్థితిపై ఆందోళనగా ఉందని వాపోయారు.

రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉండి వచ్చానని చెప్పిన ఆమె, తన భర్తను క్షేమంగా అప్పగించాలని కోరింది. సూర్యకుమారి ఇంటికి వచ్చినప్పుడు, తన భర్తతో ఏం మాట్లాడిందో తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఆమె తన ఫోన్ ను భర్తకు ఇచ్చి వెళ్లిందని మీడియాకు వెల్లడించింది. తన భర్తకు ఓ యువతితో సంబంధం ఉందని తనకు ఒక సంవత్సరం క్రితమే తెలిసిందని, అయితే, ఈ అమ్మాయేనన్న విషయం మాత్రం తెలియదని పేర్కొంది. కాగా, సూర్యకుమారి అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారగా, ఆమె ఎక్కడుందో పోలీసులు కనిపెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News