: నిన్ను ఎంత ఇష్టపడ్డానో...: అదృశ్యానికి ముందు విద్యాసాగర్ కు సూర్యకుమారి ఆఖరి మెసేజ్


"బాబీ నిన్ను ఎంత ఇష్టపడ్డానో.. నన్ను పెళ్లి చేసుకోవాలని నీ వెంట పడ్డాను. నువ్వు వద్దన్నా నిన్ను బలవంతం చేశాను. ఇంట్లో మా వాళ్లకు అన్నీ తెలిశాయి. ఇప్పుడు నన్ను ఎక్కడికైనా, నీ నుంచి దూరంగా తీసుకెళ్లి పోవాలని ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. వాళ్ల మూవ్ మెంట్ ని బట్టి నేను అలర్ట్ గా ఉంటాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నన్ను తీసుకెళ్లిపోయినట్టు నీకు తెలిస్తే, నీ లైఫ్ ని రిస్క్ లో పెడతారేమో చాలా జాగ్రత్తగా ఉండు" అంటూ సూర్యకుమారి తన అదృశ్యానికి ముందు మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ కు మెసేజ్ పెట్టింది.

విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న సూర్యకుమారి, రెండు రోజుల క్రితం విద్యాసాగర్ ఇంటికి వెళ్లి, ఆపై కనిపించలేదన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మాచవరం పోలీసులు విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అర్థరాత్రి 1.40 గంటలకు సూర్యకుమారి తన ఇంటికి వచ్చిందని, కాసేపు మాట్లాడి పంపించానని ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News