: పెళ్లయిన కాసేపటికే భర్త తలకు తుపాకి గురిపెట్టిన పెళ్లికూతురు!


అమెరికాలోని టెన్నిసీ స్టేట్ లోని ఒక హోటల్ లో కేట్ ఎలిజబెత్ ప్రిచర్డ్ (25) ను జేమ్స్ జెరేడ్ బార్టన్ (30) వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ అదే హోటల్ లో మద్యం తాగారు. బంధువులంతా అక్కడే ఉన్నారు. ఇంతలో భార్యా భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతే, పెళ్లి కూతురు అపరకాళికలా లేచింది. వెడ్డింగ్ డ్రెస్ లోంచి 9ఎంఎం హ్యాండ్ గన్ బయటకు తీసి పెళ్లి కొడుకు తలకు గురిపెట్టింది.

అయితే, అందులో బుల్లెట్స్ లేకపోవడంతో అతను బతికిపోయాడు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేశారు. పోలీసులు వచ్చేసరికి ఎలిజబెత్ తుపాకిని బాత్రూంలో దాచేసింది. అయితే వారిద్దరూ విభిన్నమైన కథలు చెబుతుండడంతో తనఖీలు చేసిన పోలీసులు, తుపాకిని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం 15,000 డాలర్ల పూచీకత్తుతో విడుదల చేసింది. 

  • Loading...

More Telugu News