: పాలబుగ్గలతో ఉన్నట్టు కనిపించే కిమ్ జాంగ్ ఓ పిచ్చోడు..: ఉత్తర కొరియా అధ్యక్షుడిపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు!


ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌పై పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనో పిచ్చోడని, చెత్త నా కొడుకంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా దీర్ఘకాలిక క్షిపణుల పరీక్షలపై ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అంతర్జాతీయ సమావేశం జరగడానికి కొన్ని రోజుల ముందు రోడ్రిగో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రమాదకరమైన బొమ్మలతో ఆయన ఆటలాడుతున్నారని రోడ్రిగో హెచ్చరించారు.

ఉత్తర కొరియాతో సంబంధాలున్న అన్ని దేశాల మంత్రులు వచ్చే వారం మనీలాలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి పరీక్షలపై చర్చించనున్నారు. అమెరికాను తాకగలిగే అణు క్షిపణిని అభివృద్ధి చేసే పనిలో నార్త్ కొరియా ఉందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. శనివారం ఉత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణి అమెరికాను చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

కాగా, రోడ్రిగో అధికార స్పీచ్‌ ఇస్తూ కిమ్ ఓ పిచ్చోడు అని, ప్రమాదకరమైన బొమ్మలతో ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. ‘‘పాలబుగ్గలతో ఉన్నట్టు కనిపించే ఆయనో ‘బిచ్’కు పుట్టినోడు. ఆయన కనుక పొరపాటు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అణు యుద్ధ వాతావరణాన్ని ఆయన తక్షణం ఆపాల్సిందే’’ అని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News