: లెఫ్ట్ పార్టీల విమర్శలను పట్టించుకోము: కేసీఆర్


లెఫ్ట్ పార్టీలు రోజురోజుకీ దిగజారుతున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అసలు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయా? అనే అనుమానం తనకు తలెత్తుతోందని అన్నారు. 300 సంఘాల వామపక్ష కూటమికి వరంగల్ లో 350 ఓట్లు కూడా రాలేదని విమర్శించారు. వామపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని, ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే వినేందుకు తాము సిద్ధంగా లేమని, కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని అన్నారు. సీపీఎం జాతీయ కార్యదర్శి కూడా చులకనతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని, గౌరవప్రదంగా వ్యవహరిస్తే మంచిదని కేసీఆర్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News