: ఆరోపణలు రుజువు చేయకపోతే జైరామ్ రమేష్ ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్
పోలీసు శాఖ వాహనాలు కొనుగోలుకు సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నాయని, మంత్రి కేటీఆర్ కు చెందిన సంస్థకు ఆ టెండర్ ను కట్టబెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏం తెలియకుండా జైరాం రమేష్ మాట్లాడుతున్నారని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపని పక్షంలో ఆయన ముక్కునేలకు రాయాలని అన్నారు. జైరామ్ రమేశ్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారాలేనని, ఒక్కటైనా ఆధారం చూపాలని, ఆ పార్టీ వాళ్లు చేసిన తప్పులు తాము కూడా చేస్తామని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. ‘జైరామ్ రమేశ్! కనీసం సర్పంచ్ గానైనా ఎప్పుడైనా పోటీ చేసి గెలిచారా?’, ‘రాజ్యసభ బగ్’ అంటూ ఆయనపై కేసీఆర్ మండిపడ్డారు.