: ‘పైసా వసూల్’కు గుమ్మడికాయ కొట్టేశారు .. సెప్టెంబర్ 1న విడుదల
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరో బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' చిత్రం షూటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టి ముగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి. ఈ ఫొటోల్లో దర్శకుడు పూరీ, నటుడు బాలకృష్ణ, ఛార్మి సహా ‘పైసా వసూల్’ చిత్ర బృందం ఉంది. కాగా, సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియా కథానాయికగా నటించింది. ఇంకా ఈ చిత్రంలో అలీ, పృథ్వీ, పవిత్ర లోకేశ్ తదితరులు నటించారు.