: అమ్మాయిలంటే పడి చచ్చే ఉగ్రవాది అబూ దుజానా... ఆ వ్యసనమే పట్టిచ్చింది!


నిన్న జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు తమ ఎన్ కౌంటర్ లో హతమార్చిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ దుజానాకు అమ్మాయిలంటే పిచ్చని, అతని వ్యసనమే అతన్ని పట్టిచ్చిందని తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్ లో 2012 తరువాత సైన్యానికి దుజానా ఎన్ కౌంటర్ అతిపెద్ద విజయమని అధికారులు భావిస్తున్న వేళ, దుజానా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. రాత్రి పూట ఎక్కువగా సంచరించే దుజానా, కాశ్మీర్ లోయలో ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని, వారి ఇళ్లకు తరచూ వచ్చి పోయేవాడని తెలుస్తోంది.

ఈ క్రమంలో పలుమార్లు భారత సెక్యూరిటీ దళాలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న దుజానా, సోమవారం రాత్రి మాత్రం దొరికిపోయాడు. అంతకుముందు భారత అధికారులు కనీసం 5 సార్లు దుజానా కోసం వల పన్ని విఫలమైనట్టు తెలుస్తోంది. కాగా, దుజానా ఓ గ్రామంలోని తన భార్య ఇంటికి వచ్చాడని, అతనితో పాటు మరో ఉగ్రవాది లాలీహారీ కూడా ఉన్నాడన్న సమాచారం అందుకున్న సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టి హతమార్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు అతని భార్య, తల్లిదండ్రులను బయటకు రావాలని కోరగా, వారు బయటకు వచ్చారు. దుజానా లొంగిపోవాలని భద్రతా దళాలు కోరినప్పటికీ, అంగీకరించని దుజానా, కాల్పులు ప్రారంభించడంతో, అతన్ని హతమార్చామని ఐజీపీ మునీర్ ఖాన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News