: కర్ణాటక కాంగ్రెస్ కు షాక్.. కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు!


కర్ణాటక కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేష్ నివాసాలపై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఈ ఉదయం వారి నివాసాలతో పాటు ఈగిల్ టన్ గోల్ఫ్ రిసార్టులో కూడా సోదాలు చేపట్టింది. గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈ రిసార్టులోనే క్యాంప్ ఏర్పాటు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ ను ఓడించేందుకు బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు శివార్లలో ఉన్న ఈ రిసార్టుకు తరలించారు. వీరి మంచి చెడ్డలను మంత్రి శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, వీరిపై ఐటీ దాడులు జరిగినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News