: కన్నడ యువనటుడు, సీసీఎల్ హీరో ధ్రువ్ ఆత్మహత్య!
పుట్టుకతోనే మూగ, చెవుటి వాడైనప్పటికీ, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన కన్నడ హీరో ధ్రువ్ శర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. తన అపారమైన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు, భారత చలనచిత్ర చరిత్రలో తొలి మూగ, బధిర హీరోగా లిమ్కా బుక్ రికార్డులకు ఎక్కిన ధ్రువ్, సొంత కంపెనీలో నష్టాలు, అప్పులు పెరగడం తదితర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని తండ్రి సురేష్ శర్మ పేర్కొన్నారు.
ఆత్మహత్యగా కేసును నమోదు చేసుకున్నప్పటికీ, పోలీసులు ఈ కేసును అనుమానాస్పద స్థితి మృతిగా భావిస్తూ విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, ధ్రువ్ శనివారం నాడు పురుగుల మందు తాగగా, ఆయన్ను బెంగళూరు, యలహంకలోని కొలంబియా ఏషియా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి ఆయన నిన్న మరణించాడు. ధ్రువ్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.