: ఆ బాధ్యత పవన్ కల్యాణ్ కు లేదా?: వైసీపీ నేత కోయ ప్రసాద్ రెడ్డి
విశాఖ భూ కుంభకోణంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించకపోవడం శోచనీయమని వైసీపీ అధికార ప్రతినిధి కోయ ప్రసాద్ రెడ్డి విమర్శించారు. లక్ష కోట్ల విలువైన భూములను కాపాడాల్సిన బాధ్యత పవన్ కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి మేరకు పవన్ భూ కుంభకోణంపై మాట్లాడటం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ ఆర్డీవోపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భూ కుంభకోణంలో ప్రభుత్వం ఓ సామాజిక వర్గాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని కోయ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.