: ‘మైక్రో మ్యాక్స్’ నుంచి కొత్త ఫోన్ ఆఫర్.. ఫోన్ పాడైతే మరో కొత్త ఫోన్!
సెల్ఫీ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని మైక్రో మాక్స్ మరో సరికొత్త మొబైల్ సెల్ఫీ 2 స్మార్ట్‌ఫోన్‌ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే విక్రయించనున్న సెల్ఫీ 2 స్మార్ట్‌ఫోన్ దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల్లోని రిటైల్ స్టోర్లలో లభ్యం అవుతుంది. ఈ మేరకు మైక్రోమ్యాక్స్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉన్న మెటాలిక్ బాడీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999. వినియోగదారులకు మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 100 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ స్కీమ్‌ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల్లోగా ఎలాంటి నష్టం కలిగినా కొత్త ఫోన్ లేదా దాని ధరకు సమానమైన మరో ఫోన్‌ను ఇవ్వడంతో పాటు ఏడాది వారెంటీని అందిస్తోంది. ఇక, ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..
* 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* 250 గంటల స్టాండ్ బై టైమ్
* 22 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్
* 5.2 అంగుళాల టచ్ స్క్రీన్
* 3జీబీ ర్యామ్
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* ఆండ్రాయిడ్ నూగట్ 7.0 ఓఎస్
* 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయం