: శిల్పా మోహన్ రెడ్డిపై అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు... పవన్ కల్యాణ్ మాతోనే అన్న మంత్రి


తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. అయినప్పటికీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించామని ఆమె చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో మోహన్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని అన్నారు. ఆయనకు ఓటు వేస్తే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటారనే భయం ఓటర్లలో ఉందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తమ కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయని... ఉప ఎన్నికలో తమ కుటుంబానికి ఆయన అండగా ఉంటారని అన్నారు. 

  • Loading...

More Telugu News