: దిగ్విజయ్ పై వేటు వేసిన సోనియా... తెలంగాణ బాధ్యతలు కుంతియాకు


దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇకపై తెలంగాణ పార్టీ బాధ్యతలను కుంతియా పర్యవేక్షిస్తారని ఆ పార్టీ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటన వెలువరిస్తూ, సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కాగా, గత కొంతకాలంగా దిగ్విజయ్ వ్యవహారాలపై టీఎస్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన విఫలమవుతున్నారన్న ఆరోపణలూ వచ్చిన నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News