: క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో ఏపీ ఎమ్మెల్యేల పేర్లు!
నెల్లూరులో వెలుగులోకి వచ్చిన క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 30 మంది బుకీలు, పంటర్లను పోలీసులు ప్రశ్నిస్తుండగా, వారి నుంచి కీలక సమాచారం వచ్చినట్టు సమాచారం. బెట్టింగ్ రాకెట్ వెనుక వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు నేతలు ఉన్నారని బుకీలు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేయగా, టీడీపీ నేతలను వదిలి తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని వైకాపా ఆరోపించింది. బుకీల నుంచి పోలీసులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని, కానిస్టేబుళ్ల నుంచి సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకూ ఇందులో భాగముందని పేర్కొన్న వైకాపా నేతలు, వారిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల విచారణ, బయటకు వెల్లడైన పేర్ల గురించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది.