: డ్రగ్స్ కేసులో సినిమావాళ్లేనే టార్గెట్ చేశారు: దర్శకుడు పీసీ ఆదిత్య
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన డ్రగ్స్ దందాలో సిట్ విచారణ తీరు పట్ల తనకెన్నో అభ్యంతరాలు ఉన్నాయని దర్శకుడు పీసీ ఆదిత్య అన్నాడు. ఈ ఉదయం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, విచారణ మొత్తం సినిమా పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని సాగిందని అన్నారు. ప్రధాన నిందితుడు కాల్విన్ సెల్ ఫోన్ లో 248 కాంటాక్టు నంబర్లుండగా, కేవలం 12 మందిని, అది కూడా సినీ ప్రముఖులను మాత్రమే సిట్ విచారించడాన్ని తప్పుబట్టిన ఆయన, ఈ విచారణను ఎదుర్కొన్నవారి కుటుంబసభ్యుల్లో ఎంతో మానసిక క్షోభ ఉందని అన్నారు. తన తదుపరి చిత్రం డ్రగ్స్ కు బానిసలుగా మారిన యువతను బయటపడేయటమెలా? అనే ఇతివృత్తంతో ఉంటుందని తెలిపారు.