: నాన్న, మేనమామతో కలసి సిట్ ఆఫీసుకు గాయని గీతా మాధురి భర్త నందు!


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త నందు కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన తండ్రి, మేనమామతో కలసి సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన, కొద్దిసేపటిలో విచారణను ఎదుర్కోనున్నాడు. కాల్విన్ మొబైల్ ఫోన్ లో నందు నంబర్ ఉండటం, వారిద్దరి మధ్యా జరిగిన వాట్స్ యాప్ సంభాషణల ఆధారంగా నందును విచారణకు పిలిపించిన అధికారులు, సుమారు 60 వరకూ ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. నేటితో సినీ ప్రముఖుల విచారణ పూర్తి కానుండగా, త్వరలోనే అరెస్ట్ చేసిన నిందితులపై కోర్టులో చార్జ్ షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతోంది.

  • Loading...

More Telugu News