: మ‌ధ్యప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఏక‌గ్రీవంగా ఎన్నికైన బీజేపీ అభ్య‌ర్థి సంపాతియా ఉయికే!


మాజీ మంత్రి అనిల్ మాధ‌వ్ దావే మ‌ర‌ణానంత‌రం ఖాళీ అయిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్య‌స‌భ స్థానం నుంచి భాజపా గిరిజ‌న అభ్య‌ర్థి సంపాతియా ఉయికే ఏక్ర‌గీవంగా ఎన్నిక‌య్యారు. ఈ విష‌యాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల కార్య‌ద‌ర్శి ఏపీ సింగ్ ప్ర‌క‌టించారు. ఈ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా డా. కె. ప‌ద్మ‌రాజ‌న్ నామినేష‌న్ వేసినా ప‌త్రాల‌ ప‌రిశీల‌న‌లో అన‌ర్హుడిగా తేలాడు. దీంతో ఎలాంటి పోటీ లేకుండా సంపాతియా ఉయికే గెలిచారు. ఈమె మండ్ల జిల్లాకు పంచాయ‌తీ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తున్నారు. గ‌తంలో 2013 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈమె రాజ్య‌సభ‌కు ఎన్నిక‌వ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 8 సీట్లు బీజేపీవి కాగా, 3 సీట్లు కాంగ్రెస్‌కి చెందిన‌ట్ట‌యింది.

  • Loading...

More Telugu News