: ప్రియుడి పుట్టిన రోజుకి స్పోర్ట్స్ బైక్ బహుమతిగా ఇచ్చిన హీరోయిన్!
ఒక పక్క తన ప్రేమ విషయంపై వచ్చే వార్తలన్నీ పుకార్లని కొట్టి పారేస్తూ, మరోపక్క ప్రియుడి పుట్టిన రోజుకు బహుమతిలిస్తోంది బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ఆనంద్ అహుజాతో ప్రేమలో ఉన్న విషయాన్ని సోనమ్ ఖండించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇటీవల ఆయన పుట్టినరోజుకు స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్‌గా ఇచ్చి, ప్రముఖ సైక్లిస్ట్ నైజెల్‌తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న విషయాలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో తమ ఊహాగానాలు నిజమే అంటూ సోనమ్‌కు అహుజాను ప్రియుడిగా మార్చేశారు నెటిజన్లు. వాళ్లకు తోడుగా మీడియాకు కూడా సోనమ్ బాయ్‌ఫ్రెండ్ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాకుండా `ముబారకన్` సినిమా ప్రచారాల్లో బిజీగా ఉన్న సోనమ్ తండ్రి అనిల్ కపూర్‌ను ఈ విషయం గురించి మీడియా అడిగింది. దీనికి అనిల్ `తన జీవితం తన ఇష్టం` అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు.