: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎప్పటినుంచో భాయి..భాయి: జేసీ ఆసక్తికర వ్యాఖ్య
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటి నుంచో భాయి, భాయి అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ, అందుకే చంద్రబాబు ఉద్దానం సమస్యను పరిష్కరిస్తున్నారని అన్నారు. నిధులు లేకపోయినా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును సాగునీటి ప్రాజెక్టులే కాపాడుతాయని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు లేకపోయినా నిధులు తీసుకొస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్కడున్నా వెంకయ్యనాయుడు తెలుగు ప్రజల కోసం పని చేస్తారని ఆయన చెప్పారు.