: నిద్రపోతున్న టీచ‌ర్ ఫొటోను విద్యాధికారికి పంపిన విద్యార్థి.. ప్ర‌తీకారం తీర్చుకున్న ఇత‌ర టీచ‌ర్లు!


త‌ర‌గ‌తిలో పాఠాలు చెప్ప‌కుండా గుర్రుపెట్టి నిద్ర‌పోతున్న ఉపాధ్యాయుని ఫొటోను జిల్లా విద్యాధికారికి వాట్సాప్ ద్వారా పంపించిన విద్యార్థిపై క‌క్ష గ‌ట్టి ఇత‌ర టీచ‌ర్లు ప‌గ తీర్చుకున్నారు. పాఠ‌శాల చుట్టుప‌క్క‌ల స్నేహితుల‌తో క‌లిసి మ‌ద్యం సేవిస్తున్నాడ‌న్న నెపంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని స్తంభానికి క‌ట్టేసి చిత‌క బాదారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి, త‌మ గ‌ణితం మాష్టారు త‌ర‌గ‌తి గ‌దిలో నిద్ర‌పోతున్న ఫొటోను విద్యాధికారికి పంపించ‌డంతో ఉపాధ్యాయుణ్ని స‌స్పెండ్ చేశారు. దీంతో ఇత‌ర టీచ‌ర్ల‌కు భ‌యం ప‌ట్టుకుంది. త‌ర్వాత ఆ విద్యార్థి స్నేహితుల‌తో క‌లిసి స్కూల్ వెన‌కాల మైదానంలో కూల్‌డ్రింక్ తాగుతుండ‌గా ప‌ట్టుకుని, మ‌ద్యం తాగుతున్నాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వివ‌రాలేమీ ఆరా తీయ‌కుండానే చిత‌క బాద‌డంతో విద్యార్థి ఆసుప‌త్రి పాల‌య్యాడు.

  • Loading...

More Telugu News