: ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలివి... సీఎంకు చెప్పిన హార్వార్డ్ బృందం
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరిగిపోవడానికి గల కారణాలను హార్వార్డ్ వైద్య బృందం ఏపీ సీఎం చంద్రబాబుకు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి రోగులతో మాట్లాడిన తరువాత తాము తయారు చేసుకున్న ప్రాథమిక నివేదికను సీఎం ముందు ఉంచారు. ఈ ప్రాంతంలో ఎండ అధికమని, నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతోందని ఈ బృందం తేల్చింది. తాగునీటిలో సిలికా అధిక మోతాదులో ఉందని, ఇక్కడి వారు నొప్పులను తట్టుకునేందుకు పెయిన్ కిల్లర్స్ అధిక మోతాదులో వాడటం వల్ల కూడా కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సాధారణ స్థాయితో పోల్చితే అధిక కలుషితాలను కలిగివున్నాయని పేర్కొంది.