: జిషాన్ నుంచి డ్రగ్స్ తీసుకుని సినీ ప్రముఖులకు అందించిన తనీష్!
ఈ ఉదయం పది గంటల సమయంలో నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న నటుడు తనీష్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్ కేసు సూత్రధారుల్లో ముఖ్యుడైన జిషాన్ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకుని వాటికి అలవాటుపడ్డ సినీ ప్రముఖులకు తనీష్ అందించే వాడన్నది ఇతనిపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ విషయంపైనే అధికారులు ప్రధానంగా ప్రశ్నలను సంధించనున్నట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. తనీష్ ను తాను మధ్యవర్తిగా వాడుకున్నట్టు జిషాన్ స్వయంగా వెల్లడించినట్టు సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్రగ్స్ వాడకందారులను బాధితులుగా పరిగణిస్తామని, ఇతరులకు వాటిని అందించిన వారిని మాత్రం వదిలేది లేదని సిట్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తనీష్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు సమాచారం.