: కేటీఆర్, సమంతలు మంచి పని చేస్తున్నారు: నాగార్జున


తెలంగాణ మంత్రి కేటీఆర్, తనకు కాబోయే కోడలు సమంతలపై ప్రముఖ నటుడు నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో కేటీఆర్, సమంతలు చాలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. చేనేతకు మరింత ప్రచారం తీసుకొచ్చే క్రమంలో వారు నిర్వహిస్తున్న 'వూవెన్' కార్యక్రమం అద్భుతమని ప్రశంసించారు. ఆగస్టు 7న జరుగనున్న ఈ కార్యక్రమం నిపుణులైన చేనేత కార్మికులకు గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని గౌరవించడం చాలా గొప్ప పరిణామమని తెలిపారు. 

  • Loading...

More Telugu News