: నేడు చంద్రబాబుతో పవన్ మాట్లాడబోయేది ఇదేనా? ఏపీలో హాట్ టాపిక్!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య నేడు జరగనున్న భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. చాలా రోజులు దూరంగా ఉన్న ఈ నేతలు ఇద్దరూ కలుసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఏం మాట్లాడుకుంటారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యలతోపాటు, హార్వర్డ్ యూనివర్సిటీ బృందంతో చేయించిన సర్వేలో వెలుగు చూసిన నిజాలను చంద్రబాబు ఎదుట ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. సమస్య మూలాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని కోరే అవకాశం ఉందని సమాచారం.

ఇందులో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ ఉద్ధానంలో నిర్వహించిన అధ్యయనం అంశాలను చంద్రబాబుకు పవన్ వివరించనున్నారు. రక్షిత మంచినీటి ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపైనా చంద్రబాబుతో చర్చించనున్నట్టు చెబుతున్నారు. అయితే వీటితోపాటు ఇంకా ఏయే అంశాలు చర్చకు వస్తాయన్న చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఉద్ధానం సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రతిపక్ష వైసీపీ సాయం కోరుతామన్న పవన్ ప్రకటన టీడీపీ నేతలను విస్మయ పరుస్తోంది. ప్రత్యేక హోదా పేరు చెప్పి వైసీపీకి పవన్ దగ్గరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News