: 21 ఏళ్లలో ఒక్క చీర కూడా కొనని అత్యంత సంపన్న మహిళ!
సాధారణంగా మహిళల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? అని ఎవరైనా అడిగితే వెంటనే టక్కున 'షాపింగ్ చేస్తారు. అందులోనూ చీరలు బాగా కొంటారు' అని సమాధానం చెబుతారు. అయితే భారత్ లో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధామూర్తి మాత్రం గత 21 ఏళ్లుగా చీరలు కొనడం మానేశానని చెప్పారు. చాలా నిరాడంబరంగా కనిపించే సుధామూర్తి 21 ఏళ్ల క్రితం కాశీకి వెళ్లినప్పుడు అక్కడ 'చీరల షాపింగ్' వదిలేశారట.
అంతే... అప్పటి నుంచి ఆమె చీరలు కొనుక్కోలేదు. అలా షాపింగ్ వదిలేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. తనతో పాటు తన భర్తకు పుస్తకాలంటే చాలా ఇష్టమని చెప్పారు. తమ లైబ్రరీలో 2 లక్షల పుస్తకాలు ఉన్నాయని వారు తెలిపారు. వారిదగ్గరున్న పుస్తకాలను ఎవరికీ అరువుగా కూడా వారివ్వరు. ఎందుకంటే, అలా ఇస్తే దానిని చదివినవారు ఆ పుసక్తం కొనడం మానేస్తారని ఆమె అంటారు. కేవలం పుస్తకాలు కొంటే మాత్రమే ఆదాయం సమకూరే రచయితలు, ఇలా ఎవరికి వారు పుస్తకాలు అప్పు తీసుకుని చదివేస్తే ఎలాబతుకుతారని ఆమె ప్రశ్నిస్తారు.