: మంచు విష్ణుకు భుజం, మెడ భాగాల్లో తీవ్రగాయాలు!


టాలీవుడ్ యువ నటుడు మంచు విష్ణు మలేసియాలో సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. షూటింగ్ సందర్భంగా బైక్ ఛేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టడంతో మంచు విష్ణు బైక్ పై నుంచి కిందపడిపోయాడు. దీంతో విష్ణు మెడ, భుజానికి తీవ్రగాయాలు అయినట్టు సమాచారం. వెంటనే అతనిని మలేసియాలోని పుత్రజయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచిన వైద్యులు, వివిధ పరీక్షలు నిర్వహించి భుజం ఎముక ఫ్రాక్చర్ అయిందని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను మరొక ఆసుపత్రికి మార్చనున్నారు. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని, ఆయన త్వరలోనే కోలుకుంటారని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆయన కోలుకునే వరకు షూటింగ్ కు విరామమివ్వనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News