: చంద్రబాబు ప్రసంగిస్తున్న వేళ మసీదు నుంచి నమాజ్... ప్రసంగాన్ని ఆపేసిన ముఖ్యమంత్రి!


అమరావతిలో పై డేటా సెంటర్ ను ప్రారంభించి, ఆపై జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న వేళ, అరుదైన ఘటన జరిగింది. పక్కనే ఉన్న మసీదు నుంచి నమాజ్ వినిపించింది. దీంతో తన ప్రసంగాన్ని నిలిపివేసిన చంద్రబాబు, నమాజ్ ఏడు నిమిషాల పాటు సాగగా, అంతసేపూ మైక్ ముందు మౌనంగా ఉన్నారు. విషయాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. నమాజ్ ముగిసిన తరువాత చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఏ మతం మనోభావాలనైనా, అందరూ గౌరవించాలని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సభికులంతా చప్పట్లతో మద్దతు తెలిపారు. పలు కంపెనీల సీఈఓలు, ఎండీలు, ఉన్నతాధికారులు చంద్రబాబు ఆలోచనా ధోరణిని, ఆయన నాయకత్వ లక్షణాలను మెచ్చుకుంటూ చర్చించుకున్నారు.

  • Loading...

More Telugu News