: అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టనున్న హీరో మహేశ్ బాబు!
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ ను అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని టాలీవుడ్ హీరో మహేశ్ బాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన మిత్రులతో కలసి ఈ స్కూల్ ను ప్రారంభించాలని ఆయన భావిస్తున్నాడని, ఈ ప్రాజెక్టులో స్లీపింగ్ పార్టనర్ గా మహేశ్ వ్యవహరిస్తారని సమాచారం. ఇక స్కూల్ ఏర్పాటు నిమిత్తం అవసరమైన భూమి కోసం సీఆర్డీయేకు మహేశ్ మిత్రబృందం త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై మరింత సమాచారం, అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.