: రిలయన్స్ జియో కన్నా తక్కువ ధరకు ఎయిర్ టెల్ 4జీ ఫోన్!


ఇటీవల రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫోన్ ఇస్తామని, ఇందుకోసం తొలుత రూ. 1500 చెల్లించాలని, మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని వెనక్కు తిరిగిచ్చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, మరో ప్రధాన టెలికం సేవల సంస్థ ఎయిర్ టెల్ అంతకన్నా తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్ అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ధర రూ. 1000 ఉంటుందని సమాచారం. అయితే, రిలయన్స్ మాదిరిగా ఈ మొత్తాన్ని కొన్నాళ్ల తరువాత తిరిగి ఇస్తారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. జియోతో పోటీని ఎదుర్కోవాలంటే, అదే వ్యూహం తప్పదని భావిస్తున్న ఎయిర్ టెల్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు టెలికం వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News