: అల్లు అర్జున్ నాకు ప్రాణం పోసాడు...ఆర్య షూటింగ్ నాటి సంఘటనను చెప్పిన సుకుమార్!


అల్లు అర్జున్ తనకు రియల్ హీరో అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెలిపాడు. హైదరాబాదులో దర్శకుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆర్య సినిమా సమయంలో ఒక రోజు షూటింగ్ సందర్భంగా తాను బోట్ లోంచి నదిలో పడిపోయానని అన్నారు. తాను పడిపోవడంతో అంతా షాక్ కు గురై అందరూ అలాగే చూస్తుండిపోయారని చెప్పాడు. అప్పటికే మునిగిపోయానని, ఇక అవి చివరి క్షణాలని అనుకుంటున్న దశలో అల్లు అర్జున్ నీట్లోకి దూకేశాడని గుర్తుచేసుకున్నాడు. తనను రక్షించడానికి వచ్చిన అల్లు అర్జున్ ను ఎలాగైనా బతికేయాలన్న ఆశతో మూడు సార్లు నీట్లో ముంచేశానని చెప్పాడు. చివరికి తనను ఎలాగోలా నీట్లోంచి బయటపడేశాడని తెలిపాడు. అలా అల్లు అర్జున్ తన రియల్ లైఫ్ హీరో అని అన్నాడు. తరువాత మనం మళ్లీ సినిమా చేద్దామని అడగలేదని, తనకు ఏడు కథలు ఇవ్వాలని అడిగాడని గుర్తు చేసుకున్నాడు. దీంతో తన ఇగో హర్ట్ అయిందని అన్నాడు. 

  • Loading...

More Telugu News