: గవర్నర్ తో భేటీ అయిన చంద్రబాబు
గవర్నర్ నరసింహన్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఈ మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తాజా పరిణామాలను గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారు. చంద్రబాబు నిన్ననే హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి జరిగిన రామోజీరావు మనవరాలి వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఇదిలా ఉంచితే, త్వరలోనే ఇరు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్ లను నియమిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి విదితమే.