: మోదీ గొప్ప వ్యక్తే.. కానీ, ఇండియా అంటే ఇందిరనే!: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ


భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి అని పొగుడుతూనే... మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇండియా అంటేనే ఇందిర అంటూ ఆమె కితాబిచ్చారు. తాను పెరిగి పెద్దదాన్ని అవుతున్నప్పుడు ఇందిర తనకు భారత్ ను బహూకరించారని అన్నారు. తన వ్యాఖ్యలు కొందరికి నచ్చకపోవచ్చని... కానీ, ఇది తన మనసులోని మాట అని చెప్పారు. భారత్ నుంచి కశ్మీర్ ను ఓ టెలివిజన్ ఛానల్ వేరు చేసి చూపించిందని... ఆ ఛానల్ చూపించింది తనకు తెలిసిన భారత్ కాదని... భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయలేరని ఆమె అన్నారు. భారత్ లో కశ్మీర్ అంతర్భాగమని చెప్పారు.

  • Loading...

More Telugu News