: గుజరాత్ కాంగ్రెస్ లో సంక్షోభం.. రాత్రికి రాత్రి బెంగళూరుకు 54 మంది ఎమ్మెల్యేల తరలింపు!


గుజరాత్ లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. తమ ఎమ్మెల్యేలు వరుసబెట్టి పార్టీకి రాజీనామాలు చేస్తూ, బీజేపీలో చేరుతుండటం అధిష్ఠానాన్ని షాక్ కు గురి చేసింది. దీంతో, పార్టీని రక్షించుకునే చర్యల్లో భాగంగా... నిన్న రాత్రి 54 మంది ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించింది.

దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ స్పందిస్తూ, బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లోనుకాకుండా ఉండేందుకే వారిని దూరంగా తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 10 కోట్లను బీజేపీ ఆఫర్ చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. తాము డబ్బు ఇవ్వజూపుతున్నామనే ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన... సింపుల్ గా నవ్వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావలాంటిదని అన్నారు. మునిగిపోతున్న నావలో ఉన్నవారు అక్కడ నుంచి బయటపడటానికే ప్రయత్నిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News