: రవితేజ, సిట్ మధ్య జరిగిన సంభాషణ ఇదే!
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ విచారణ ముగిసింది. సిట్ అధికారులు రవితేజ నుంచి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. విచారణ సందర్భంగా సిట్ అధికారుల ప్రశ్నలకు రవితేజ దీటుగా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు, రవితేజ మధ్య జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళ్తే...
సిట్: కెల్విన్, జీశాన్ మీకు ఎన్నాళ్లుగా పరిచయం?
రవితేజ: కెల్విన్ నాకు తెలుసు, జీశాన్ ఎవరో తెలియదు.
సిట్: పూరీ సినిమా షూటింగ్ ల సమయంలో ఎక్కెడెక్కడికి వెళ్లేవారు?
రవితేజ: ఏ సినిమాకయినా...డైరెక్టర్ ఎక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్తాం. షూటింగ్ జరిగే సమయాల్లో అక్కడున్న గెస్ట్ హౌస్ లో బస చేస్తాం, హైదరాబాద్ లో అయితే ఇంటికెళ్తాం.
సిట్: విదేశాలకు వెళ్లినప్పుడు మీ అలవాట్లు ఎంటి?
రవితేజ: ప్రత్యేకమైన అలవాట్లేవీ లేవు...ఇంటి పుడ్ వండించుకునే ఏర్పాట్లు చేస్తాను. డైట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాను.
సిట్: జీశాన్ తో పరిచయాలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి?
రవితేజ: జీశాన్ తెలియదన్నప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు.
సిట్: ఈవెంట్, ఆడియో ఫంక్షన్లలో కెల్విన్ కు మీతో పనేంటి?
రవితేజ: కెల్విన్ ఒక్కడే కాదు ఈవెంట్ సమయాల్లో చాలా మందిని కలుస్తుంటా.
సిట్: డ్రగ్స్ మీరొక్కరే తీసుకునే వారా..? ఇంకా సహచర నటులు ఎవరైనా ఉన్నారా?
రవితేజ: డ్రగ్స్ అలవాటే లేనప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగడం పద్ధతి కాదు.
సిట్: ఏఏ పబ్ ల్లోకి ఎక్కువగా వెళ్లేవారు?
రవితేజ: పబ్ లకు వెళ్లే అలవాటు నాకు లేదు. అలాంటప్పుడు ఏఏ పబ్బుల్లో అన్న ప్రశ్న సరికాదు.
సిట్: షూటింగ్ లేని సమయల్లో బ్యాంకాక్ లో ఎలాంటి పార్టీలు చేసుకుంటారు?
రవితేజ: యూనిట్ సభ్యులంతా కలిసి చిన్నపాటి పార్టీలు చేసుకుంటాం.
సిట్: ముమైత్, చార్మీ, పూరీ ద్వారా పరిచయం అయ్యారా?
రవితేజ: సినిమా రంగంలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ పూరీ ద్వారానే పరిచయం అయ్యారంటే సరిగా ఉంటుందా? అంటూ రవితేజ సిట్ కు సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది. కాగా, రక్తం, వెంట్రుకలు, కాలి, చేతి గోళ్లను పరీక్షల కోసం అడగగా రవితేజ నిరాకరించినట్టు తెలుస్తోంది. రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును విచారించనున్నట్టు తెలుస్తోంది.