: విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పిన అభినవ్ ముకుంద్!


శ్రీలంకలోని గాలెలో ఆతిధ్య జట్టుతో కలిసి ఆడుతున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఆకట్టుకుంటోంది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన టీమిండియా ఓపెనర్ అభినవ్ ముకుంద్ కెప్టెన్ కోహ్లీతో స్థిరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బౌలర్లు చెలరేగడంతో శ్రీలంకను 291 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా విజయమే లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వేగంగా పరుగులు చేసి, భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచాలని టీమిండియా వ్యూహం రచించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్లతో చెలరేగిన శిఖర్ ధావన్ (14), ఛటేశ్వర్ పుజారా (15)ను ఆదిలోనే లంక బౌలర్లు పెవిలియన్ కు పంపారు.

దీంతో తొలి ఇన్నింగ్స్ లో విఫలమై నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్ అభినవ్ ముకుంద్ (57) కు కోహ్లీ (57) జతకలిశాడు. వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించినా, పిచ్ బౌలర్లకు సహకరించినా చెక్కుచెదరని ఏకాగ్రతతో వీరద్దరూ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆర్థసెంచరీలు చేశారు. దీంతో మూడోరోజు ఆటలో రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసిన టీమిండియా 452 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

  • Loading...

More Telugu News