: త్వరలో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ పెళ్లి?
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పెళ్లికొడుకు కాబోతున్నాడనే వార్తలు హిందీ చిత్రసీమలో హల్‌చల్ చేస్తున్నాయి. వరుణ్ ప్రియురాలు నటాషా దలాల్‌తోనే తన వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి గురించి ఇప్పటికే చాలా పుకార్లు వచ్చినా, వాటిపై వరుణ్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మొదటిసారి ఈ విషయం గురించి బాలీవుడ్ నటి నేహా ధూపియా ఇంటర్వ్యూలో మాట్లాడాడు వరుణ్.
`మా రిలేషన్ గురించి అందరికీ తెలుసు. కాకపోతే నేనెప్పుడూ పబ్లిగ్గా మాట్లాడలేదు. ఆమె సినీ రంగానికి చెందింది కాదు. ఆమెను మీడియా నుంచి రక్షించడానికే నేను ఆ విషయం గురించి పెద్దగా మాట్లాడను` అని వరుణ్ అన్నాడు. మరి పెళ్లి సంగతేంటని నేహా ప్రశ్నించగా - `నిజం చెప్పాలంటే, మేం అంత దూరం ఆలోచించలేదు. జీవితంలో మీకు అన్ని రకాల నచ్చినవారు కనిపిస్తే, పెళ్లి లాంటి విషయాలు అసలు గుర్తుకురావు` అని వరుణ్ సమాధానమిచ్చాడు.